prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:05 pm Digital Edition : NAVEEN NADIKUDA

కరీంనగర్ జిల్లాకు రెండోసారి బాధ్యతలు.. మంద రాజుకు మందకృష్ణ మాదిగ దిశానిర్దేశం

కరీంనగర్ జిల్లాకు రెండోసారి బాధ్యతలు.. మంద రాజుకు మందకృష్ణ మాదిగ దిశానిర్దేశం

 

హనుమకొండ ప్రజావాణి ఆగస్టు1

 

ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జిగా మంద రాజును రెండోసారి నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేసి, జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని సూచించారు.

ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఎంఆర్‌పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి సంస్థను క్షేత్రస్థాయిలో విస్తరించాలని మందకృష్ణ మాదిగ ఆదేశించారు. సామాజిక న్యాయం, వర్గీకరణ సాధన లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఈ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని మంద రాజు తెలిపారు. నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కమిటీల ఏర్పాటు పూర్తి చేసి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంద రాజుకు శుభాకాంక్షలు తెలిపారు.