prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 2:08 am Digital Edition : PRAJA VANI

కరీంనగర్‌లో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావానికి వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్‌లో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావానికి వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కరీంనగర్: ఈ నెల 25వ తేదీన నూతన రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు అంకం శివరాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాధవి చేతుల మీదుగా తెలంగాణ జాగృతి పార్టీ వాల్ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే, పార్టీ విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలను తెలంగాణ జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేతుల మీదుగా జాగృతి కండువాలు కప్పి సభ్యత్వం కల్పించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జాగృతి ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, బీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, సీనియర్ నాయకులు గాలిపెల్లి రత్నాకరాచారి, కలకుంట్ల జలజ, చంటి శ్రీనివాస్, రోజా రెడ్డి, హర్ష యసుల్తాన్, రూప, మంజుల, అనూష, స్వరూప, మల్లేశ్వరి, మౌనిక, బెజ్జంకి సంపత్, పొత్తూరి శ్రీధర్, దాసరి ప్రభాకర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.