prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:24 am Digital Edition : NAVEEN NADIKUDA

కమలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాసాల శ్రీనివాస్ నియామకం

కమలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా వాసాల శ్రీనివాస్ నియామకం

 

ప్రజావాణి, ఆగస్టు 4 హుజురాబాద్ నియోజకవర్గం

 

హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా భీంపల్లి గ్రామానికి చెందిన వాసాల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం సోమవారం నుంచి అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

వాసాల శ్రీనివాస్ గతంలో ఎన్ఎస్‌యూఐలో జిల్లా స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో భీంపల్లి గ్రామ సర్పంచ్‌గా భారీ మెజారిటీతో విజయం సాధించారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఓడితెల ప్రణయ్ బాబుకు సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.

 

నియోజకవర్గ ఇన్‌చార్జి ఓడితెల ప్రణయ్ బాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి సిఫారసుల మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ నియామకాన్ని ఖరారు చేశారు.

 

ఈ సందర్భంగా వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష పదవికి సిఫారసు చేసిన ఓడితెల ప్రణయ్ బాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

 

మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వాసాల శ్రీనివాస్ స్పష్టం చేశారు.