కనిగిరి లో వైభవంగా అర్చక పురోహితులకు పంచాంగాల పుస్తకాల పంపిణీ
కనిగిరి ప్రజావాణిన్యూస్(మార్చి25)నూతన (పరాభవ నామ) సంవత్సర సందర్బంగా కనిగిరి లోని స్థానిక బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పంచాంగ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.'పరాభవ'నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని,కనిగిరి నియోజకవర్గానికి చెందిన జాతీయ యువజన కార్యదర్శి సంగరాజు సాయి మనోజ్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.సంగరాజు సాయి మనోజ్ జాతీయ స్థాయి పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చిన సందర్భంగా,కనిగిరి ప్రాంతంలోని అర్చక పురోహితులందరికీ నూతన సంవత్సర పంచాంగాలను అందజేశారు. కేవలం పంచాంగాలే కాకుండా,కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు...