prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 2:01 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కనిగిరి లో వైభవంగా అర్చక పురోహితులకు పంచాంగాల పుస్తకాల పంపిణీ

కనిగిరి ప్రజావాణిన్యూస్(మార్చి25)నూతన (పరాభవ నామ) సంవత్సర సందర్బంగా కనిగిరి లోని స్థానిక బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పంచాంగ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.’పరాభవ’నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని,కనిగిరి నియోజకవర్గానికి చెందిన జాతీయ యువజన కార్యదర్శి సంగరాజు సాయి మనోజ్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.సంగరాజు సాయి మనోజ్ జాతీయ స్థాయి పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి వచ్చిన సందర్భంగా,కనిగిరి ప్రాంతంలోని అర్చక పురోహితులందరికీ నూతన సంవత్సర పంచాంగాలను అందజేశారు. కేవలం పంచాంగాలే కాకుండా,కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ప్రత్యేక అనుగ్రహంతో పొందిన ఆధ్యాత్మిక పత్రాలను కూడా స్వామివారి ఆశీస్సులతో పురోహితులకు పంపిణీ చేయడం విశేషం.ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితులు వినుపాముల రామకృష్ణ శర్మ సాయి మనోజ్ ను వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు.యువకుడైన మనోజ్ జాతీయ స్థాయిలో కీలక పదవిని పొందడం పట్ల కనిగిరి అర్చక సంఘం హర్షం వ్యక్తం చేస్తూ,ఆయనను ఆశీర్వదించారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ముఖ్య అతిథులు గా ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కళ్యాణ మండపం చైర్మన్ ధూళిపాళ్ల వీరభద్రరావు,శానికొమ్ము జగన్ మోహన్ రెడ్డి,శివాలయం డైరెక్టర్ సూరపరాజు తులసి, మరియు పెద్ద సంఖ్యలో అర్చకులు,పురోహితులు పాల్గొన్నారు.బ్రాహ్మణ సమాజ సంక్షేమానికి,ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సాయి మనోజ్ చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమం కనిగిరి బ్రాహ్మణ సేవా సంఘం మరియు స్థానిక ప్రజల ప్రశంసలను అందుకుంది.ఈ కార్యక్రమం లో అర్చకులు పురోహితులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు