కడప మేత్రాసనం ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఆధ్యాత్మిక – సామాజిక అవగాహనతో ఘనంగా వివాహ తర్ఫీదు కార్యక్రమం
కడప ప్రజావాణి న్యూస్) మేత్రాసనంలోని యేసు తిరుహృదయ సువార్తా కేంద్రం ఆధ్వర్యంలో పోరుమామిళ్ల డీనరీకి చెందిన వివాహానికి సిద్ధమవుతున్న యువతీ యువకుల కోసం మూడు రోజులపాటు నిర్వహించిన వివాహ తర్ఫీదు కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో,విలువైన సందేశాలతో,సామాజిక అవగాహనతో ఘనంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌గా వ్యవహరించిన రెవ. ఫా.వరప్రసాద్ ముండ్లపాటి యువతీ యువకులకు వివాహ బంధం యొక్క పవిత్రత, కుటుంబ జీవితం యొక్క బాధ్యతలు,పరస్పర గౌరవం,ప్రేమ, క్షమ,మరియు ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను ఎంతో హృదయానికి హత్తుకునే విధంగా వివరించారు.మూడు రోజులపాటు నిర్వహించిన ఈ తర్ఫీదు...