prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:31 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కడప మేత్రాసనం ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఆధ్యాత్మిక – సామాజిక అవగాహనతో ఘనంగా వివాహ తర్ఫీదు కార్యక్రమం

కడప ప్రజావాణి న్యూస్) మేత్రాసనంలోని యేసు తిరుహృదయ సువార్తా కేంద్రం ఆధ్వర్యంలో పోరుమామిళ్ల డీనరీకి చెందిన వివాహానికి సిద్ధమవుతున్న యువతీ యువకుల కోసం మూడు రోజులపాటు నిర్వహించిన వివాహ తర్ఫీదు కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో,విలువైన సందేశాలతో,సామాజిక అవగాహనతో ఘనంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌గా వ్యవహరించిన రెవ. ఫా.వరప్రసాద్ ముండ్లపాటి యువతీ యువకులకు వివాహ బంధం యొక్క పవిత్రత, కుటుంబ జీవితం యొక్క బాధ్యతలు,పరస్పర గౌరవం,ప్రేమ, క్షమ,మరియు ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను ఎంతో హృదయానికి హత్తుకునే విధంగా వివరించారు.మూడు రోజులపాటు నిర్వహించిన ఈ తర్ఫీదు కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని యువతకు నేటి సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై విస్తృత అవగాహన కల్పించారు. సిస్టర్ శౌరీలు దాంపత్య జీవితంలో ఐక్యత,పరస్పర అవగాహన, సహనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.టీచర్ ఆనందరావు కుటుంబ ప్రార్థన కుటుంబ బంధాలను ఎలా బలపరుస్తుందో వివరించారు. పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.హేమసుందర్ రావు నేటి యువత మొబైల్ ఫోన్లు,సోషల్ మీడియా,సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాల వల్ల ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఉదాహరణలతో వివరించి,వాటి నుండి ఎలా జాగ్రత్తపడాలో చట్టపరమైన అవగాహన కల్పించారు.డాక్టర్ ఆర్.వి.ఎల్.స్వాతి.వివాహానికి ముందు మరియు తర్వాత ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడులు, దాంపత్య ఆరోగ్యం,మరియు కుటుంబ జీవితంలో ఆరోగ్యకరమైన సంబంధాలపై విలువైన సూచనలు అందించారు.ఉపాధ్యాయులు శోభన్ కుమార్ ఓబుళాపురం “వివాహ జీవితంలో నేటి సమస్యలు” అనే అంశంపై మాట్లాడుతూ,కుటుంబ విభేదాలు,అనుమానాలు కమ్యూనికేషన్ లోపం,సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై చైతన్యం కల్పించారు. ప్రేమతో ప్రారంభమైన బంధం నమ్మకంతో నిలబడాలి, ప్రార్థనతో బలపడాలి అనే సందేశం అందరికీ స్ఫూర్తినిచ్చింది.మూడవ రోజు రెవ. ఫా.సుధాకర్, లాయర్ ఫా.మనోహర్ కుటుంబ జీవితంలో దేవుని వాక్య ప్రాముఖ్యత,చట్టపరమైన అవగాహన,మరియు క్షణిక తప్పిదాల వల్ల కుటుంబాలపై పడే ప్రభావాలను స్పష్టంగా వివరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ప్రతిరోజూ పవిత్ర దివ్యబలిపూజ,జపమాల ప్రార్థన,ఆరాధన,కౌన్సిలింగ్,గ్రూప్ డిస్కషన్,మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతకు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కల్పించారు.చివరి రోజు కడప పీఠాధిపతులు మోస్ట్ రెవ. డా.సాగినాల పాల్ ప్రకాష్ గారు హాజరై పవిత్ర దివ్యబలిపూజ అర్పించి యువతను ఆశీర్వదించారు. అనంతరం పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. సందర్భంగా పలువురు యువతీ యువకులు మాట్లాడుతూ,ఈ కార్యక్రమం తమ భవిష్యత్ కుటుంబ జీవితానికి ఎంతో ఉపయోగపడిందని, వివాహం అనేది కేవలం ఒక వేడుక కాకుండా బాధ్యతతో కూడిన పవిత్ర బంధమని తెలుసుకున్నామని పేర్కొన్నారు