వైఎస్ఆర్ కడప జిల్లా జులై 13 (ప్రజావాణి కడప పారిశ్రామిక ప్రగతికి మరో మైలురాయి.జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమర్లలోని దాల్మియా సిమెంట్ ప్లాంట్ ను.సందర్శించిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.రూ.3,478 కోట్లతో చేపట్టే దాల్మియా ప్లాంట్ లైన్–2 విస్తరణ పనులను చేపట్టే ప్రాంతాన్ని.రాష్ట్ర ప్రభుత్వ విప్,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్.15న రాష్ట్ర ఐటీ,ఎలక్ట్రానిక్స్,మానవ వనరుల అభివృద్ధి,నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.లైన్–2 విస్తరణ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మంత్రి నారా లోకేష్ భూమి పూజ,శంకుస్థాపన చేయనున్న ప్రాంతాలు,సమావేశ హాలు,ఎక్సపిరియన్స్ జోన్,మంత్రి,వీఐపీలు బస చేసే గ్రీన్ రూమ్స్,తాత్కాలిక,రిఫ్రెష్మెంట్ట్,డైనింగ్ హాలు ఏర్పాట్ల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.మంత్రి పర్యటన ఏర్పాట్లు,భద్రతా ఏర్పాట్లు,పార్కింగ్,గ్యాలరీ,సీటింగ్,మీటింగ్ డయాస్ మొదలైన ఏర్పాట్లపై సంబందిత ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు,సలహాలు,అదేశాలిచ్చిన జిల్లా కలెక్టర్.స్థానిక ప్రజా ప్రతినిధులు,విఐపి లాంజ్ లతో పాటు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ,ఎమ్మెల్యే లతో చర్చించిన జిల్లా కలెక్టర్.ఈ సందర్భంగా ప్లాంట్ అతిధి గృహంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో.ఎక్కడ ఎలాంటీజ్ కొరత లేకుండా.సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.విద్యుత్,ఫైర్,మెడికల్,ఆర్డబ్ల్యూఎస్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు అదేశాలిచ్చిన జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి.అంతకు మునుపు జమ్మలమడుగు కు సమీపంలోని కర్మలవారిపల్లెలో మంత్రి లోకేష్ బస చేసే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ,ఎమ్మెల్యే లతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్.కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక యువ నాయకులు భూపేష్ రెడ్డి,దాల్మియా ప్లాంట్ హెడ్ అర్పన్ కుమార్ పరెక్, జమ్మలమడుగు,పులివెందుల,బద్వేలు ఆర్డీవోలు శిరీష,చిన్నయ్య,చంద్రమోహన్,సబ్ కలెక్టర్ జాన్ ఇర్విన్, సంబందిత జిల్లా అధికారులు తదితరులు.