
కలసపాడు జూన్ 7 ప్రజావాణి ఫాదర్ లక్కినేని ఆరోగ్య రాజు – కడప ఛాన్స్లర్ మరియు ఫాదర్ గడికోట మనోహర్ CMSSS director సహకారాలతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ లు పంపిణీ.కలసపాడు మండలంలోని ఆర్ సి ఎం చర్చి ఆవరణలో విచారణ గురువులు కొత్తపల్లి మనోహర్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కార్యక్రమం అనంతరం మహిళలకు కడప డయాసిస్ బిషప్ సగినాల పాల్ ప్రకాష్ చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని తలంపుచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఇందుకు సహకరించిన విచారణ గురువులు మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విచారణ కతోలిక క్రైస్తవులు పీసీసీ నెంబర్లు ఉపదేశులు పాల్గొన్నారు