prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 3:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కడప జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే సిపిఐ ఉద్యమ కార్యాచరణ 

పోరుమామిళ్ల ప్రజావాణి జూన్ 9) ఈనెల 18, నుండి 20 వరకు జిల్లా శిక్షణా తరగతులు జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపు,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విభజన సమయంలో అనేక హామీలు గుప్పించి నారని ప్రధానంగా కడప జిల్లా ఉక్కు పరిశ్రమ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదని అందుకే జిల్లాలో ఉన్న సిపిఐ శ్రేణులను ఉద్యమ కార్యాచరణ లోకి తీసుకురావడానికి ఈ నెల 18 నుంచి 20 వరకు బద్వేల్ పట్టణంలో జరుగుతున్న రాజకీయ సైతాంతిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సిపిఐ కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు గురువారం పోరుమామిళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ప్రధానంగా నల్లధనం వెలికి తీసి ప్రజలకు పంపిణీ చేస్తానని ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు మోసం చేశాడు మేక్ ఇండియా మేడిన్ ఇండియా పేరుతో భారతదేశ ముందుకు పోతున్నదని చెబుతున్నప్పటికీ కేవలం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని సంపద సృష్టించే శ్రమజీవులకి సంపదలో వాటా లేదని కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేస్తున్నారని పేద ధనిక అనే తారతమ్యం అంతరం పెరిగిపోవుచున్నదని అలీన విదేశాంగ విధానం కాకుండా అమెరికా సామ్రాజ్యవాదులకు సాగిలపడి దేశ ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని కార్పొరేట్ కనుసనల్లో నడుస్తున్న ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువకులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపడుతున్నారని నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగితే ఆకలి దరిద్రం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిపిఐ దేశవ్యాప్తంగా ప్రచారం ఆందోళనకు శ్రీకారం చుడుతున్నానని రాష్ట్రంలో డబ్బులు ఇంజన్ సర్కారులు అభివృద్ధి అటకెక్కిందని ఇది డబుల్ సర్కారు కాదు ట్రబుల్ ఇంజన్ సర్కారని ఆయన విమర్శించారు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి చుట్టూ తిరిగి ప్రజల కు భ్రమలు కల్పిస్తున్నారని పెండింగ్ ప్రాజెక్టులు పరిశ్రమలు మాటలకే పరిమితమైందని ఆయన అన్నారు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు పాదయాత్రలు నిర్వహించి నరహంతకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయని వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నామని చెబుతున్న ఉపముఖ్యమంత్రి సంవత్సరాల తరబడి పోరుమామిళ్ల పట్టణ కేంద్రంలో రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేయలేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే ఈ పనులను పూర్తి చేయాలని లేకుంటే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్,ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ సహాయ కార్యదర్శి పి.వి.రమణ మండల కార్యదర్శి పి రవికుమార్ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవమండల నాయకులు మహమ్మద్ సఫా, కలసపాడు మండల కార్యదర్శి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు