కడప జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని,ఆయిల్ కంపెనీ డిపోల నందు ప్రజల రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.నిధి మీనా తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా.ఆయిల్ కంపెనీ సేల్స్ అధికారులు,పౌర సరఫరా అధికారులు మరియు పెట్రోలియము డీలర్లతో సమావేశము నిర్వహించారు.ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం పెట్రోల్ బంకులలో (ఐఓసీ-65,బీపీసీఎల్-58,హెచ్పీసీఎల్-92,నయారా-14 రిలియన్స్ జియో-5) ఉన్నాయని తెలియజేశారు.ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన బంకుల నందు పెట్రోలు/డీజిలు ధరలు పెరగడము వలన సదరు బంకుల్లో అధిక శాతం డీజిల్ విక్రయాలు తగ్గిపోయాయని,సదరు వినియోగదారులంతా ప్రభుత్వ రంగ సంస్థల బంకులకు వస్తున్నారన్నారు.దీంతో వినియోగం పెరిగడంతో.గతంలో కాంట్రాక్టర్లు,ఇతర బల్క్ వినియోగదారులు గతంలో నేరుగా ఆయిల్ కంపెనీ నుండి డీజిల్ కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ధరలు పెంచడము వలన ఇప్పుడు వారంతా ప్రభుత్వ రంగ డీలర్ల నుంచి డీజిల్ కొనుగోలు చేస్తున్నారన్నారు.పరిశ్రమల అవసరాలకు సరఫరా చేసే డీజిల్ ధర లీటరుకు రూ.152 వరకు చేరింది. దీంతో వీరు కూడా ప్రభుత్వ రంగ బంకుల్లోనే డీజిల్ కొంటున్నారు.పెట్రోలు కొరత లేదని కాని భయంతో వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తు న్నారు అధికశాతం మంది ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఎవరూ ఇంధన కొరత వస్తుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని,ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అపోహలకు లోనుకాకుండా ప్రజలు ఎప్పట్లాగే తమ సాధారణ వినియోగాన్ని కొనసాగించాలని కోరారు.ఒకవేళ ఎక్కడైనా బంకుల్లో ఇంధనం తక్కువైతే వెంటనే అక్కడ నిల్వలు అందుబాటులోకి తెచ్చేలా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందు కొరకు డీలర్లు కూడా టోల్ ఫ్రీ నెంబరు 1967 కు ఫోను చేసి నిల్వలు అయిపోయిన విషయము ప్రభుత్వ దృష్టి తీసుకొని రావచ్చునని తెలియజేశారు.డీలర్లు పెట్రోల్,డీజిల్ అనవసరంగా కొనుగోలు చేసి నిల్వలు దాచిపెట్టి, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో తేల్చి చెప్పారు.అలాగే కడప జిల్లాలో పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని,ఆయిల్ కంపెనీ డిపోల నందు ప్రజల రోజువారీ అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు