కడప జిల్లా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు కొట్టం చిన్న లక్ష్మయ్య ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నివాళులు

కడప (ప్రజావాణి న్యూస్ జూన్ 28)జిల్లాలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావానికి తొలి అడుగు వేసిన కొట్టం చిన్న లక్ష్మయ్య ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుడుగా ఉంటూ మాదిగ జాతి అభివృద్ధి కోసం మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ కడప జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఉనికిని నలుమూలల చాటిన లక్ష్మయ్య మన దగ్గర లేకపోవడం బాధాకరమని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.మాదిగ రిజర్వేషన్ పోరాట...