కడప ఎస్ఎఫ్ఐ నూతన నగర కమిటీ ఎన్నిక.
కడప జూలై 16 ప్రజావాణి నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో కడప నగర నూతన కమిటీ నీ ఎన్నుకోవడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి అన్నారు. ఆంధ్ర రాష్ట్రం లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ నూతన నగర కమిటీ ఎన్నుకోవడం జరిగిందని వారు అన్నారు. రాష్ట్రంలో ఉన్న రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 ను రద్దు చేసి ప్రైవేట్ ఏయిడెడ్ విద్యాసంస్థల పీజీ...