prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 4:59 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కడప ఉక్కుకు శిలా పథకం వద్దు పనులు ప్రారంభం ముద్దు సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పాలక ప్రభుత్వంపై మండిపాటు.

బద్వేల్ జూలై 02 ప్రజావాణి సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ శంకుస్థాపనలకే పరిమితమైన ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభించడంలో కూటమి ప్రభుత్వం విఫలం.కడప ఉక్కు పరిశ్రమలు ఇప్పటికే నాలుగు దుబాలుగా ప్రారంభం వేసి పునాదిరాళ్లు వేసి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి గత ప్రభుత్వం నేటి ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా పునాదిరాళ్లకే పరిమితమయ్యాయి తప్ప ఉక్కులు తయారు చేయడంలో ఎలాంటి ముందడుగు లేదని ఇప్పుడు మళ్ళీ కోటను ప్రభుత్వం పునాదిరాళ్లు వేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు,కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నేడు రెండు సంవత్సరాల తర్వాత కడప ఉక్కు గుర్తుకు రావడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఆయన యదవ చేశారు ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమను ప్రారంభించడమే కాదు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని లేని పక్షంలో మరో ఉక్కు ఉద్యమం తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారుఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బాలు ఏరియా సహాయ కార్యదర్శి ఇమ్మానుయేల్ జిల్లా సమితి సభ్యులు పడిగా వెంకటరమణ పాల్గొన్నారు