కడపలో స్కాన్ సెంటర్ల వద్ద పార్కింగ్ కష్టాలు: శ్రీ లక్ష్మి స్కాన్స్ వద్ద రోగుల అవస్థలు, అధికారుల తనిఖీలకు డిమాండ్!

కడప జిల్లా జూలై 14 ( ప్రజావాణి ) కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో వెలుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వద్ద కనీస పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడం వాహనదారులకు, రోగులకు పెద్ద శాపంగా మారింది. ముఖ్యంగా కడప టౌన్ ఆర్‌.ఎస్‌. రోడ్‌లో,సి.ఎస్.ఐ హైస్కూల్ ఎదురుగా ఉన్న ప్రముఖ డయాగ్నోస్టిక్ సెంటర్ ‘శ్రీ లక్ష్మి స్కాన్స్  వద్ద సరైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో నిత్యం రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్లు, ఇతర వాహనాల్లో వచ్చే రోగులు తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో...