prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 10:14 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కందుకూరి విశిష్ట సేవా పురస్కారం అందుకున్న సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘు రాములు

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) సీతారామ పురం మండలం పోలం గారి పల్లెకు చెందిన సమాజ సేవకులు సీతారామపురం సొసైటీ డైరెక్టర్ పెనుబడి రఘు రాములుకు కందుకూరి విశిష్ట సేవా పురస్కారం మేరా యువ భారత్ జిల్లా అధికారి ఆకుల మహేంద్ర రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అక్షయ్ సొసైటి ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ మరియు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరు శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి స్మారక భవనం ( టౌనుహాలు )నందు కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకొని తెలుగు రంగస్థల దినోత్సవం సందర్భంగా కందుకూరి విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కందుకూరి విశిష్ట సేవా పురస్కార గ్రహీత పెనుబడి రఘు రాములను శాలువా, మాల, మొమెంటో, మెడల్, ప్రశంసాపత్రం, కిరీట దారణతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో ఎస్.వి.రమేష్ బాబు, అందే శ్రీనివాసులు, యనమల నాగేశ్వరరావు, ఎ.జయప్రకాశ్, డాక్టర్ రాచపాలెం రఘు, డాక్టర్ చీదరాల చెన్నయ్య, నిర్వాహకులు కె.మురళీమోహన్ రాజు, జోష్న, శ్రీకర్ రెడ్డి, ఓంకారం వెంకటేశ్వర్లు, కేతా సుధాకర్ రెడ్డి, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.