ఔషాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ఘట్‌కేసర్, ఆగస్టు 1: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చైతన్యపురికి చెందిన మహేంద్ర దిలీప్ బాయ్ చౌహన్ (45), స్వస్థలం సూరత్, తన ద్విచక్ర వాహనంపై చైతన్యపురి నుంచి హనుమకొండకు వెళ్తుండగా, ఉదయం సుమారు 9:44 గంటల సమయంలో ఔషాపూర్‌లోని హెచ్‌పీసీఎల్ సంస్థ సమీపానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తన ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని కారును ఢీకొట్టడంతో బైక్‌పై నుంచి కిందపడిపోయాడు. అదే...