ఓయూ వైస్ ఛాన్సలర్ ఎం. కుమార్‌కు ఘన సన్మానం.  చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ అభినందనలు

ఘట్కేసర్ మే 25 (ప్రజావాణి): చిన్ననాటి స్నేహితులు రేసు లక్ష్మారెడ్డి, దాసరి దవీందర్ రెడ్డి కలిసి ఓయూ వైస్ ఛాన్సలర్ ఎం. కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఘాట్ కేసర్ జడ్పీహెచ్‌ఎస్ 1970-71 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో బ్రహ్మం ఆధ్వర్యం లో వారి స్నేహితులతో కలిసి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరస్పరం ఆనందాన్ని పంచుకున్నారు. విద్యా రంగంలో ఎం. కుమార్ సాధించిన ఉన్నత స్థానంపై స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల...