ఘట్కేసర్ మే 25 (ప్రజావాణి): చిన్ననాటి స్నేహితులు రేసు లక్ష్మారెడ్డి, దాసరి దవీందర్ రెడ్డి కలిసి ఓయూ వైస్ ఛాన్సలర్ ఎం. కుమార్ ని ఘనంగా సన్మానించారు. ఘాట్ కేసర్ జడ్పీహెచ్‌ఎస్ 1970-71 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో బ్రహ్మం ఆధ్వర్యం లో వారి స్నేహితులతో కలిసి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పరస్పరం ఆనందాన్ని పంచుకున్నారు. విద్యా రంగంలో ఎం. కుమార్ సాధించిన ఉన్నత స్థానంపై స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల రోజుల నుంచి కొనసాగుతున్న స్నేహబంధం ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఎం. కుమార్ కి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం అందరూ కలిసి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు.