ఓటర్లకు అందుబాటులో ఉండాలి…. కాంగ్రెస్ కార్యకర్తలకు డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్ పిలుపు
ఘట్‌కేసర్, జూలై 22 : రాబోయే పది రోజుల పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓటు హక్కు పరిరక్షణ కోసం కృషి చేయాలని ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి వార్డులో ఎస్‌ఐఆర్ పర్యవేక్షణలో బీఎల్‌ఏలతో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని...