ఓటరు జాబితా సవరణ పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ కు రెడ్డి అప్పలనాయుడు సూచన..
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు అందరూ భాగస్వాములు కావాలి.ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం.. ఏలూరు,ప్రజావాణి జూన్ 7 ఓటరు జాబితాలో ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల పరిశీలనను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్,ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలకు పిలుపునిచ్చారు.ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు అవకతవకలు చోటుచేసుకోకుండా...