ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.నాయకులు,కార్యకర్తలు, వీర మహిళలు అందరూ భాగస్వాములు కావాలి.ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం..
ఏలూరు,ప్రజావాణి జూన్ 7 ఓటరు జాబితాలో ప్రత్యేక సవరణ కార్యక్రమం నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల పరిశీలనను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్,ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలకు పిలుపునిచ్చారు.ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు అవకతవకలు చోటుచేసుకోకుండా క్షేత్రస్థాయిలో,పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సమావేశానికి సంబంధించి జనసేన కన్వీనర్లు, క్లస్టర్ ఇన్చార్జిలు,బూత్ కన్వీనర్లు,కో కన్వీనర్లు,నాయకులు కార్యకర్తలు,వీర మహిళలతో ఓటరు జాబితాలపై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైన అంశం అన్నారు.అర్హుడైన ప్రతి ఒక్క ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు,అనర్హు ల పేర్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ (సర్) కార్యక్రమం పై పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి బూతు స్థాయిలో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని,కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలతో సమన్వయం చేసుకొని పనిచేయాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు.ఫోటో,జాబితాలో పేర్ల చేర్పు తొలగింపు,మార్పులు వంటి అంశాలపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ప్రతి ఓటర్ పేరు తప్పక ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్న సందర్భంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2026 కార్యక్రమం పై దిశానిర్దేశం చేశారు.ఈనెల 15వ తేదీ నుండి జూలై 14 వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ నెల రోజులపాటు,బూత్ లెవెల్ అధికారులు, ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ వివరాలను సమగ్రంగా పరిశీలించి,అర్హులైన ఓటర్లను సవరణ జాబితాలో (హౌసింగ్ మ్యాపింగ్) పొందుపరుస్తారని వివరించారు. సర్వే అధికారులు ఇంటింటికి వెళ్లినప్పుడు,స్థానిక బూత్ లెవెల్ ఏజెంట్లు,యూనిట్ ఇన్చార్జిలు వారితో కలిసి వెళ్లాలన్నారు. ఆయా ఇళ్లల్లో అర్హులైన ఓటర్ల వివరాలను వారికి అందజేసేలా చూడాలన్నారు. ఇందులో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రత్యర్థి పార్టీలు మన ఓట్లను గల్లంతు చేసి కుట్రలకు పాల్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ముఖ్యంగా కూటమి పార్టీలకు చెందిన పార్టీ మద్దతుదారులు,తటస్థ దార్ల ఓటర్లను సవరణ జాబితాలో తప్పించకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.ఇప్పుడు నిద్రపోతే ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదం ఉందని,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని పేర్కొన్నారు.ఈలోగా ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఓటర్ల జాబితా సమగ్రంగా ఉండేలా బాధ్యతగా పనిచేయాలన్నారు. 18 సంవత్సరాలు పైపడ్డా వారందరి పేర్లను ఓటర్ల జాబితాలో తప్పక చేర్పించాల్సి ఉందన్నారు.అలాగే చనిపోయిన,పెళ్లిళ్లు చేసుకునే ఇతర ప్రాంతాలకు వెళ్లిన,లేదా శాశ్వత వలసదారులను గుర్తించి వారి పేర్లను జాబితా నుండి తొలగించేలా చూడాలన్నారు. వైసీపీ పార్టీ వారు రెండు మూడు చోట్ల తమ పేరు నమోదు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందన్నారు.ఎక్కడైనా అలా ఉంటే వెంటనే గుర్తించి సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి,ఓటర్ల జాబితా నుండి తొలగింప చేయాలన్నారు.రాబోయే నెల రోజులు మనకు పరీక్ష సమయమని,ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని రెడ్డి అప్పలనాయుడు సూచించారు.ఈ సమావేశంలో లో నగర అధ్యక్షులు వీరంకిపండు,మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్,రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ,జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా,కార్పోరేటర్లు పొలిమేర దాసు,కోయ సత్తిబాబు,జనసేన కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జీలు,బూత్ కన్వీనర్లు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు, భారీ సంఖ్యలో జనసైనికులు తదితరులు హాజరయ్యారు..