ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.స్వయం సహాయక సంఘాల సభ్యులకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
కడప జూలై 06 ప్రజావాణి భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొని ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటన ద్వారా కోరారు.ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారం (ఈఎఫ్) పూరించిన వారు ఆలస్యం చేయకుండా తమ ఆర్‌పీ/యానిమేటర్ ద్వారా లేదా నేరుగా బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కి అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించని పక్షంలో డ్రాఫ్ట్...