ఒత్తిడికి లోను కాకుండా ఇష్టపడి చదవండి – గఫార్
ప్రజావాణి న్యూస్: (మార్చి 08 కలసపాడు:ఒత్తిడికి లోను కాకుండా ఇష్టపడి చదివితే అద్భుతమైన ఆశించిన ఫలితాలు పొందవచ్చని పీపుల్ ఫర్ సోషల్ సైన్సెస్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గఫార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్.కె మెమోరియల్ హై స్కూల్ 10 తరగతులు విద్యార్థులు వీడ్కోలు సమావేశంలో పాల్గొని ప్రసంగించిన గఫార్ మాట్లాడుతూ జీవితంలో జన్మనిచ్చిన తల్లిని జీవితాన్నిచ్చిన తండ్రిని జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవులను మరువక వారి ఆశీస్సులతో అభ్యసనాన్ని కొనసాగిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలిపారు .అట్లే సమాజంలో విద్యార్థుల చదువులకు అవరోధంగా...