prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 3:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఒత్తిడికి లోను కాకుండా ఇష్టపడి చదవండి – గఫార్

ప్రజావాణి న్యూస్: (మార్చి 08  కలసపాడు:ఒత్తిడికి లోను కాకుండా ఇష్టపడి చదివితే అద్భుతమైన ఆశించిన ఫలితాలు పొందవచ్చని పీపుల్ ఫర్ సోషల్ సైన్సెస్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గఫార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎస్.కె మెమోరియల్ హై స్కూల్ 10 తరగతులు విద్యార్థులు వీడ్కోలు సమావేశంలో పాల్గొని ప్రసంగించిన గఫార్ మాట్లాడుతూ జీవితంలో జన్మనిచ్చిన తల్లిని జీవితాన్నిచ్చిన తండ్రిని జ్ఞానాన్ని ప్రసాదించిన గురుదేవులను మరువక వారి ఆశీస్సులతో అభ్యసనాన్ని కొనసాగిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలిపారు .అట్లే సమాజంలో విద్యార్థుల చదువులకు అవరోధంగా నిలిచిన సెల్ఫోన్ ,టీవీ సినిమా ,చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, వీటికి దూరంగా ఉన్నప్పుడే చదువుకు దగ్గరై అనుకున్న విజయాలు సాధించగలరని తెలిపారు. ఒత్తిడికి లోను కాకుండా అనునిత్యం సంతోషంగా ఉంటూ ప్రశాంతతతో చదవడం అలవర్చుకుంటు సబ్జెక్టు విషయమై బృంద చర్చలు చేసుకుంటూ అధ్యయనము కొనసాగించాలని ,లక్ష్యాన్ని నిర్దేశించుకుని చక్కగా చదివి కన్న తల్లిదండ్రుల ఆకాంక్షల్ని నెరవేర్చాలని పాఠశాల పేరును సమున్నత స్థానంలో నీలపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్. కె విద్యా సంస్థ సిఏఓ షేక్ హెచ్. ఎం.ఖాద్రి, హెడ్మాస్టర్ బాషు, సీనియర్ అధ్యాపకులు మురళి మోహన్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.