ఒక కూపన్ కు ఇష్టానుసార అనుమతులా.. తహసిల్దార్ సార్

తిరుమలాయపాలెం, ప్రజావాణి :కాకరవాయి గ్రామం నుంచి మేడిదపల్లి గ్రామానికి ఇసుక తరలింపు వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇసుక రీచ్‌గా గుర్తించని డ్రై ఏరియా నుంచి ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. మేడిదపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పేరుతో కొంతమంది కాంట్రాక్టర్లు అనుమతి పత్రాలు చూపిస్తూ ఇసుక తరలిస్తున్నట్టు సమాచారం. అయితే ఒక కూపన్ లేదా ఒక అనుమతి ఆధారంగా అనేక ట్రిప్పులు ఇసుక తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా “పాల్” రెడ్డి పేరుతో కొందరు అనుమతులు ఉన్నట్లు...