prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 2:28 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లను.రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య ,,సన్మానించారు

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. వెంకటేశ్వర్లను ఈరోజు ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల కూచిందిన సీనియర్ నాయకులు కలవడం జరిగింది. రాజంపేట నియోజవర్గ సీనియర్ నేత ఒంటిమిట్ట మండల టిడిపి నాయకుడు రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య రెండు మండలాలకు చెందిన నాయకులను సిఐ కి పరిచయం చేయడం జరిగింది. తన పరిధిలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు నాయకులకు తెలుపడం జరిగింది. రాజంపేట కోడూరు చిట్వేలి తదితర ప్రాంతంలో చాలా కాలం పాటు పనిచేయడం జరిగిందని, ఒంటిమిట్టలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తానని శ్రీ ఈ సందర్భంగా నాయకులకు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల టిడిపి సీనియర్ నాయకుడు మామిళ్ళ ఈశ్వరయ్య ఉన్నం కిరణ్ స్వామి, మౌలాలి, సిద్దోటం మండల సీనియర్ నాయకులు మాజీ ఉపాధ్యక్షుడు పుత్త రామచంద్రయ్య, చల పాటి చంద్ర, రామ్మోహన్ నాయుడు సుధా మురళి, యువ నాయకులుఆడిటర్ పుత్త శివానంద రాయల్ మఠం రాజు తదితరులు పాల్గొన్నారు