ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి… కేసు నమోదు.యన్టీ.ఆర్. జిల్ల నందిగామ పట్టణ పరిధిలో వజ్రాల పేరిట మహిళను భారీగా మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇంటి పక్కనే అద్దెకి ఉండి పరిచయమై మోసం చేసిన కేటుగాడు కరుణాకర్ రెడ్డి(కన్నా )నమ్మించి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని నా ఆశ చూపి మహిళా నుంచి 5 లక్షలు నగదు వసూలు చేసి మాయం పథకం ప్రకారమే ఇలా ఇలా చేశాడని బాధిత మహిళ నూర్జహాన్ లబోదిబో.ఏం జరిగిందో తెలుసుకుందాం రండి నూర్జహాన్ మాటల్లో.నా పేరు నూర్జహాన్ నేను నందిగామ రెండో వార్డ్ లో నివాసం ఉంటాను మా పక్కింట్లో అద్దెకి ఉండి మాయమాటలు చెప్పి వజ్రాల వ్యాపారం చేస్తున్నాను అని మోసం చేసి ఐదు లక్షలు కావాలి ఐదు లక్షల ఉంటే వజ్రాలు కొంటాను 15 లక్షలు వస్తాయి మీకు అధిక మొత్తంలో ఇస్తానని మోసం చేశాడు. ఇతను పూర్తి పేరు జల్లాపురం కృష్ణవేణి తండ్రి, జల్లాపురం కన్నా అలియాస్ కరుణాకర్ రెడ్డి, తనకు వజ్రాల వ్యాపారం ఉందని ఆమెను నమ్మబలికాడు. కేవలం ₹5 లక్ష లకే మార్కెట్‌లో ₹10 నుండి ₹15 లక్షల విలువ చేసే వజ్రాలు వస్తాయని, అందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నాకు ఆశ చూపాడుని బాధితురాలు వాపోయింది.పథకం ప్రకారమే కరుణాకర్ రెడ్డి మోసం చేశాడని నా దగ్గర ఉన్న బంగారాన్ని చూసి బ్యాంకులో పెట్టి ఇవ్వమని వచ్చిన వెంటనే అధిక మొత్తంలో ఇస్తానని ఆశ చూపించి మోసం చేశాడని లబోదిబోమంటున్న నూర్జహాన్.నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తో త్వరలోనే డబ్బులు ఇస్తానని నమ్మబలికి మరో మోసానికి తెర తీసిన కరుణాకర్ రెడ్డి. పెద్ద మనుషుల అండతో కర్ణాకర్ రెడ్డి మాయం.విజయవాడ కమిషనర్ ను ఆశ్రయించిన బాధిత మహిళ ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సి ఉంది.