prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:21 am Digital Edition : PRAJA VANI

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

*ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు*

*పోలియో వ్యాధి నిర్మూలన సాధ్యమని వైద్యుల వెల్లడి*

* *మన ప్రజావాణి* మందమర్రి:-జూన్ 28

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. చిన్నారులను పోలియో వ్యాధి బారిన పడకుండా రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మందమర్రి ప్రాంతంలోని దీపక్ నగర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఒకటో వార్డు తారకరామ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, సూపర్వైజర్ సురేఖ, ఏఎన్ఎం పుష్పలత, ఆశా వర్కర్ సునీత పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.అధికారులు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధి పూర్తిగా నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని కోరారు. గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో ప్రత్యేక బృందాల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.