ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి సింధు ఆదర్శ్ రెడ్డి

•ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రపురం, జూన్ 28 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీ బస్తీ దవాఖానా, ఎల్‌ఐజీ కాలనీ సొసైటీ కార్యాలయం సమీపంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత...