•ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి: సింధు ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం, జూన్ 28 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీ బస్తీ దవాఖానా, ఎల్‌ఐజీ కాలనీ సొసైటీ కార్యాలయం సమీపంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భారతీనగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని, ప్రతి ఒక్కరూ దీనిని విజయవంతం చేయడానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశుతోష్, బస్తీ దవాఖానా ఏఎన్‌ఎంలు యమున, సారా, ఎల్‌ఐజీ కాలనీ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, మైనారిటీ సీనియర్ నాయకుడు గౌస్, నరసింహ, ఇతర నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.