ఐటీ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర
(వైఎస్సార్ కడప జిల్లా జులై 16 ప్రజావాణి) జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామ సమీపంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన దాల్మియా సిమెంట్ ప్లాంట్ (లైన్-2) రూ. 3,100 కోట్ల విస్తరణ పనుల శంకుస్థాపన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా మరియు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్‌ను బద్వేల్ నియోజకవర్గ బీజేపీ ప్రముఖ నాయకుడు, పోరుమామిళ్ల మండల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ,ఈ...