prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:45 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఐటీ మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర 

(వైఎస్సార్ కడప జిల్లా జులై 16 ప్రజావాణి) జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామ సమీపంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన దాల్మియా సిమెంట్ ప్లాంట్ (లైన్-2) రూ. 3,100 కోట్ల విస్తరణ పనుల శంకుస్థాపన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా మరియు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్‌ను బద్వేల్ నియోజకవర్గ బీజేపీ ప్రముఖ నాయకుడు, పోరుమామిళ్ల మండల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ,ఈ పర్యటన సందర్భంగా నాగేంద్ర మంత్రి లోకేష్‌తో కాసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి శరవేగంగా పుంజుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంతో పాటు,పోరుమామిళ్ల ప్రాంతంలో ఉన్న స్థానిక సమస్యలు, విద్యా ఉపాధి అవకాశాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రాయలసీమ ప్రగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది, జమ్మలమడుగు సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా దాదాపు 1,000 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ సంయుక్త కార్యాచరణతో కడప జిల్లాలో వరుసగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, దాల్మియా విస్తరణ వంటి భారీ పరిశ్రమలు రావడం పట్ల బీజేపీ నేత నాగేంద్ర ప్రభుత్వానికి మరియు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.