ఐక్యత లేని ఎర్రజెండా
ఐక్యత లేని ఎర్రజెండా సిద్ధాంతాల చట్రంలో కమ్యూనిస్టు శ్రేణులు మార్పు దిశగా అడుగులు పడేనా? భారతీయ రాజకీయ యవనికపై శ్రామిక వర్గ పక్షపాతిగా, పీడిత ప్రజల గొంతుకగా కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ఉజ్వలమైన చరిత్ర ఉంది. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేసిన విప్లవ శక్తి అది. అయితే, ఒకే మార్క్సిస్టు సిద్ధాంతం, ఒకే సామ్యవాద గమ్యం అని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎమ్మెల్ వంటి వివిధ వర్గాలు), వాటి ప్రాణనాళాలైన విద్యార్థి సంఘాలు (ఏఐఎస్ఎఫ్,...