ఐక్యత కరవై.పాత్రికేయులకు న్యాయం దూరం.యూనియన్ల జోరు.సమస్యల పరిష్కారంలో జీరో.జర్నలిస్టుల మధ్య చీలికలు.రాజకీయ నేతలకు వరాలు

నంద్యాల జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 07) నంద్యాల పట్టణం ఎన్నికల్లో హామీలు.ఆ తర్వాత జర్నలిస్టులకు మొండిచేయి.ఐక్య పోరాటమే పరిష్కారం అంటున్న సీనియర్లు.ఇంటి స్థలాలు,ప్రెస్ క్లబ్ కోసం సమిష్టి పోరాటమే మార్గం.జిల్లాలో పాత్రికేయుల సమస్యలు సంవత్సరాలుగా పేరుకుపోతున్నా వాటి పరిష్కారంలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు.ముఖ్యంగా జర్నలిస్టుల్లో ఐక్యత కొరవడటం,యూనియన్ల పేరుతో విభజనలు పెరగడం వల్ల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఫలితంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి,అనంతరం పట్టించుకోకుండా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి అప్పట్లో ఐక్యత.ఇప్పుడు విభజనలు.2009కు ముందు...