ఐఐటి ,జేఈఈ మెయిన్స్, నీట్ పేర్లతో పుస్తకాలను అమ్ముతూ విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి,పి.డి.ఎస్.యు

కర్నూలు జూన్ 08 ప్రజావాణి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్,ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఐఐటి జేఈఈ మెయిన్స్,నీట్ పుస్తకాల పేర్లతో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని,తక్షణమే విద్యాశాఖ అధికారులు గుర్తింపు రద్దు చేయాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ డిమాండ్ చేశారు.సోమవారం నాడు స్థానిక కర్నూలు *కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ -పిజిఆర్ఎస్) కార్యక్రమం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారికి పి.డి.ఎస్.యు నేతలు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ...