prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 10:19 am Digital Edition : PRAJA VANI

ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ కు ఘన సన్మానం

ఐఎన్టియుసి ఆధ్వర్యంలో ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ కు ఘన సన్మానం

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 4

సింగరేణి ఏరియా ఎస్ అండ్ పిసి విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బదిలీపై వచ్చిన బోయిని ఓదెలు ను సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శనివారం పట్టణంలోని ఎస్ అండ్ పిసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య లు ఓదెలు ను శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎస్ అండ్ పిసి జూనియర్ ఇన్స్పెక్టర్ గా ఏరియాకు మరిన్ని సేవలు అందించి, అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ జాయింట్ కార్యదర్శి కే జగన్నాథ చారి, ఎస్ అండ్ పిసి పిట్ కార్యదర్శి కేఆర్ సంపత్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి చంద్రగిరి మురళి, ఎస్ అండ్ పిసి జమేదార్ దశరథం, ఐఎన్టియుసి పిట్ కమిటీ నాయకులు, సభ్యులు, ఎస్ అండ్ పిసి  సిబ్బంది పాల్గొన్నారు.