ఏ రైవ్ ..అలైవ్ కార్యక్రమం లోభాగంగా తాడ్వాయి–ఉగ్రవాయి ప్రమాద స్థలాలపై సమగ్ర విశ్లేషణ
ప్రజావాణి
ఏప్రిల్ :17
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న తాడ్వాయి మరియు ఉగ్రవాయి ప్రాంతాల్లో ప్రమాదాల కారణాలపై జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో Arrive – Alive కార్యక్రమం లో భాగంగా సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పరిశీలన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రమాదాలకు దారితీసే అంశాలను గుర్తించి, వాటి నివారణకు అవసరమైన చర్యలపై అధికారులు చర్చించారు. ముఖ్యంగా రహదారి పరిస్థితులు, హెచ్చరిక సూచికల ఏర్పాటు, వేగ నియంత్రణ చర్యలు, మరియు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్, సదాశివనగర్ సీఐ సంతోష్, ఆర్ & బీ ఈఈ మోహన్ తదితర రవాణా, పోలీస్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రమాదాల నివారణకు శాఖల సమన్వయంతో తగిన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
