ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ వార్నింగ్ :

ఏలూరు జూన్ 7 ప్రజావాణి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.పాత కక్షలు,గొడవలను కొనసాగించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపిస్తాం.రౌడీషీటర్లు తమ పాత నేర చరిత్రను విడిచిపెట్టి సత్ప్రవర్తనతో జీవించాలి.సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మారి కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.రౌడీషీటర్ల కదలికలపై బీట్ సిబ్బంది,ఇంటెలిజెన్స్ విభాగం నిరంతరం నిఘా ఉంచుతుంది.చిన్న తప్పిదం చేసినా లేదా అసాంఘిక శక్తులతో సంబంధాలు...