prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 4:14 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ వార్నింగ్ :

ఏలూరు జూన్ 7 ప్రజావాణి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం.పాత కక్షలు,గొడవలను కొనసాగించి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కొత్త చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపిస్తాం.రౌడీషీటర్లు తమ పాత నేర చరిత్రను విడిచిపెట్టి సత్ప్రవర్తనతో జీవించాలి.సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మారి కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి.రౌడీషీటర్ల కదలికలపై బీట్ సిబ్బంది,ఇంటెలిజెన్స్ విభాగం నిరంతరం నిఘా ఉంచుతుంది.చిన్న తప్పిదం చేసినా లేదా అసాంఘిక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నా కఠిన చర్యలు తప్పవు.స్థానిక పోలీసుల అనుమతి లేకుండా స్టేషన్ పరిధి దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లరాదు.ప్రతి రౌడీషీటర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధిగా హాజరై నమోదు చేసుకోవాలి.రానున్న రోజుల్లో ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు సహకరించాలి.నిబంధనలు అతిక్రమిస్తే బైండోవర్ చర్యలు చేపడతాం.అవసరమైతే నగర బహిష్కరణ వంటి కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాం.ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిని ఎంతటి వారైనా సహించం.రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకుని ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు.