prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 11:45 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణ చెప్పాలి ;;;;బద్వేల్ ఎమ్మెల్యే సుధమ్మ

కడపజిల్లాప్రజావాణిన్యూస్ (ఏప్రిల్09)బద్వేలునియోజకవర్గం.వైయస్ఆర్ సీపీ నేతల భార్యలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ  వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు.వైయస్ఆర్ సీపీ నేతల భార్యలు, కుటుంబాలపై ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయి.నేతల వ్యక్తిగత జీవితాలను దూషిస్తూ రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాం.రాధాకృష్ణ తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు,మహిళలు నీకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ఇలాంటి వికృతమైన రాతలు రాసే రాధాకృష్ణను ఇకపై జర్నలిస్ట్ గా సంబోధించవద్దని పాత్రికేయ లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.మహిళల గౌరవాన్ని కాపాడటంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ గార్లు వైయస్ఆర్ సీపీ నాయకులు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏబీఎన్ రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాధు చేశారు.