సిద్దిపేట్, ఏప్రిల్ 15, ప్రజావాణి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమ నిర్వహణలో ఏప్రిల్ 16వ తేదీన నిర్వహించే మండల సభలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా మండల అధికారులు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.బుదవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో ఏప్రిల్ 16 తేదీన నిర్వహించే మండల సభ ఏర్పాట్ల గూర్చి అందరూ జిల్లా అధికారులు,మండలస్థాయిలో ఎంపిడిఓ, తహసిల్దార్, ఏంఈఓ, మెడికల్ ఆఫీసర్, అగ్రికల్చర్, హౌసింగ్ పంచాయతీ రాజ్ ఏఈలు, ఏపిఎం, ఐసిడిసి ఇతర శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో ఏప్రిల్ 2 న గ్రామసభలను విజయవంతం చేశారని అలాగే ఏప్రిల్ 16 వ తేదీన మండల సభల నిర్వహణ ఏర్పాట్లు సైతం పగడ్బందిగా చెయ్యాలనితెలిపారు.మండల సభల ఏర్పాట్లు, నిర్వహణ పూర్తి బాధ్యత ఎంపీడీఓ లదే మండల వివిధ శాఖల అధికారులందరితో కో- ఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వ పథకాల అమలు గూర్చి మండల స్థాయిలో మంచి పోటో ఎక్సిబిషన్ ఏర్పాటు చెయ్యాలనితెలిపారు.ప్రభుత్వం 99 రోజులకార్యక్రమంలో ఒక్కో వారం ఒక్కో థీమ్ కి కేటాయించారు. ఈ వారం థీమ్ అరైవ్- అలైవ్ గూర్చి రవాణా, పోలీస్అధికారులతో ప్రతిజ్ఞ మరియు థీమ్ యొక్క ఉద్దేశం గూర్చి సభలో చర్చించాలని ఆదేశించారు.ఈ మండల సభల గూర్చి స్థానిక ఏంపి, ఏంఎల్ఎ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల ప్రజాప్రతినిధులను, అధికారులకు ఆహ్వానం అందించాలి.జిల్లా అధికారులుమీకుకేటాయించిన మండలాల్లో మండల సభలు నిర్వహణ ఏర్పాట్ల గూర్చి ఈ రోజు ముందస్తు సమావేశాలు నిర్వహించాలనీ ఆదేశించారు.ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల, గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరా మహిళ శక్తి బ్యాంక్ లింకేజి, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపినీ, ఎన్ ఆర్ ఈ జీ ఎస్ లోచేపట్టినపనులు,సన్నబియ్యం పంపిణీ, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, రైతురుణమాఫీసంబంధించిన పూర్తి సమాచారాన్ని లబ్ధిదారుల నంబర్ ప్రభుత్వం అందజేసిన నిధుల గూర్చి తెలపాలి. అలాగే ప్రభుత్వ పథకాల అమలు గూర్చి స్టాల్ లను ఏర్పాటు చేసుకోవాలి.అలాగే నాచురల్ ఆర్గానిక్ ఫామింగ్ గూర్చి మీమండలంలో ట్రైనింగ్ ఇచ్చిన అధికారులను వారిని పిలుచుకుని సభలో దాని గూర్చి ప్రజలకు తెలపాలని, అలాగే పంట మార్పిడి గురించి తెలియజేయాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లో అనుకూలమైన ప్రదేశంలో సిట్టింగ్ అరేంజ్మెంట్, ఆడియో మైక్ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, బ్యానర్స్ లు ఏర్పాట్లు, పబ్లిసిటీ మెటీరియల్ జిల్లా అధికారులు అందజేస్తారని తెలిపారు.ఈ సభలో 16 వ తేదీన ఉదయం 10 గంటలకు సభ మొదలు పెట్టాలని, ఎజెండా ఐటమ్స్ వెల్ కం అడ్రస్, తెలంగాణ గీతం, వివిధ పథకాల అమలు గూర్చి ఆయా మండల అధికారులు బ్రీఫ్ గా మాట్లాడాలి. మీరు చేసిన ప్రోగ్రామ్ గురించి మొత్తం ప్రక్రియ డాక్యుమెంట్ చెయ్యాలని ఆదేశించారు.జూన్ 2 నుండి ప్రభుత్వం అమలు చేయబోయే కొత్త పధకాల గూర్చి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ఏప్రిల్ 2 రోజున తీసుకున్న పలువురు అందజేసిన ఫిటిషన్ లను వెరిఫై చేసి వాటిని పరిగణనలోకి తీసుకొని వెరిఫై చెయ్యాలని ఆదేశించారు. అలాగే మండల సభల్లో ప్రజలు ఏదైనా పిటిషన్లు ఇచ్చిన స్వీకరించి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ మండల సభలను మండల స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో ఒక పండుగ వాతావరణంలో విజయవంతంగా జరపాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, లక్ష్మీ కిరణ్, జెడ్పి సీఈవో రమేష్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, డిడబ్లుఓ శారద, ఇరిగేషన్ ఈ ఈ తదితరులు పాల్గొన్నారు..