ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కొత్త రూల్స్.. ఆధార్ ఉంటేనే.. ఏపీలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట

అమరావతి,జూన్ 7 ప్రజావాణి.రైతుకు ఎంత పొలం ఉంది ? అందులో ఏ పంట సాగు చేశారు ? దానికి శాస్త్రీయంగా ఎంత మోతాదులో ఎరువులు అవసరం ? అనే లెక్కల ఆధారంగానే ఇకపై ఎరువులను విక్రయించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన అగ్రికల్చర్‌ ప్రొడ్యూస్‌ అండ్‌ ఇన్‌పుట్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (APAIMS) యాప్ ద్వారా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూరియా, డీఏపీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ యాప్‌ను అమలు చేస్తున్న కృష్ణా, కాకినాడ జిల్లాలకు మాత్రం ఈ...