prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 8:02 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు అస్వస్థత.. మణిపాల్‌ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స..!

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25)  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు.ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో,రాజ్‌భవన్ సిబ్బంది వెంటనే ఆయనను విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25) ఉదయం ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో,రాజ్‌భవన్ సిబ్బంది వెంటనే ఆయనను విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది. గవర్నర్ ఆరోగ్యంపై ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు,ఆయన ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని సమాచారం అందించారు.గ్యాస్ట్రిక్ సమస్య లేదా ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల ఈ నొప్పి వచ్చిందా అన్న కోణంలో వైద్యులు డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తున్నారు.గవర్నర్ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపుతున్నారు. మరిన్ని వివరాల కోసం రాజ్‌భవన్ వర్గాలు అధికారిక బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది