ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కీలకం

  గోదావరిఖని: ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా అప్లికేషన్లలో మరింత ఖచ్చితత్వాన్ని సాధించవచ్చని కాకతీయ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. బి. రమ అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మూడు రోజుల పైథాన్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కృత్రిమ మేధస్సు, నాలెడ్జ్‌ను అనుసంధానం చేసుకుంటూ మెషిన్ లెర్నింగ్‌పై పట్టు సాధించాలని సూచించారు. వివిధ మోడళ్లను రూపొందించి సమగ్ర సమాచారాన్ని పొందుపరచడం ద్వారా అప్లికేషన్లలో...