prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 10:31 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఏఐటియుసి 18 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి ఏటియుసి రాష్ట్ర నాయకులు పిలుపు

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) సూళ్లూరుపేట  పట్టణంలో జరుగుతున్న ఏఐటియుసి 18 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గత 17వ రాష్ట్ర మహాసభ జరిగిన గుంటూరు నుండి బయలుదేరిన జీపు జాతకు సూళ్లూరుపేట పట్టణంలో ఘనస్వాగతం పలికారు. ఈ జీపు జాతను ఉద్దేశించి రాష్ట్ర నాయకులు అంజిబాబు, సిపిఐ సీనియర్ నాయకులు పార్థసారథి మాట్లాడుతూ ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమంలో కార్మికులను ఏకతాటి మీదకు తెచ్చిన ఏఐటియుసి 106 సంవత్సరాలుగా కార్మిక సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నదని కార్మికుల హక్కుల రక్షణ ధ్యేయంగా అనేక అనేక వీరోచిత పోరాటాలకు నాయకత్వం వహించి కార్మిక చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం కావడం ద్వారా అనేక కార్మిక సంక్షేమ చట్టాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, నేడు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు దేశ శ్రామిక రంగాన్ని ఉద్యమ బాటలో నడిపిస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలందరూ ఏకతాటిపై ఖండిస్తున్న నేపథ్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు తిరుపతి పట్టణంలో జరుగునున్నయని ఈ మహాసభల జయప్రదం కోరుతూ కార్మికలోకం తరలిరావాలని కోరారు. గుంటూరు నుండి బయలుదేరిన జాత సూళ్లూరుపేటకు చేరిందని సూళ్లూరుపేటలో కార్మికులు ఆహ్వానం పలకడం సంతోషాదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు నాగేంద్రబాబు రమణయ్య బాలు లక్ష్మమ్మ బాలయ్య నాగరాజు బాబు పాళ్లెయ్య తదితరులు పాల్గొన్నారు