prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 12:45 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

ఎస్సీ రుణాల లబ్ధిదారులకు ముఖాముఖి

​ఎస్సీ రుణాల లబ్ధిదారులకు ముఖాముఖి

​ఉదయం 10 గంటల నుంచి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహణ

​వివరాలు వెల్లడించిన ఎంపీడీవో వెంకట సాయి శివానంద్

​చెన్నారావుపేట మే 18 ప్రజావాణి

మండలంలో ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల 20వ తేదీ బుధవారం ఇంటర్వ్యూలు ముఖాముఖి నిర్వహించనున్నట్లు చెన్నారావుపేట ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.​లబ్ధిదారులు ఇంటర్వ్యూకు వచ్చే సమయంలో ఈ క్రింది పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.​ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ​అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు ​ఒక సెట్ జిరాక్స్ ప్రతులు​ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ​అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఎంపీడీవో వెంకట సాయి శివానంద్ కోరారు.