prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 12:31 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష & జరినామా – జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

  • *ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష & జరినామా – జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్లగొండ జిల్లా డిండి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెంబర్ 151/2013 కు సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో నల్లగొండలోని ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు ఇద్దరు నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందని జిల్లా ఎస్పి తెలిపారు. కేసు వివరాల ప్రకారం చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన నక్క పర్వతాలు (యాదవ్), డిండి మండలానికి చెందిన ఒక ఎస్సీ కులానికి చెందిన యువతీతో పరిచయం పెంచుకొని మాయ మాటలు చెప్పి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి బాధిత యువతీని శారీరకంగా వాడుకున్నాడు. అనంతరం యువతీ పెళ్ళి చేసుకోమని అడగగా నక్క పర్వతాలు, తన అత్త అయినా నీలం సత్తమ్మ కలిసి కులాన్ని దుషిస్తూ పెళ్ళికి నిరకరించారని బాధిత యువతీ ఇచ్చిన మేరకు డిండి పోలీస్ స్టేషన్లో (ఐపిసి) సెక్షన్లు 417, 420, 323, 506 రెడ్ విత్ 109 ఐపిసి మరియు ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) సవరణ చట్టం 2015లోని సెక్షన్ 3(1)(x) కింద కేసు నమోదు చేయబడింది. విచారణ అనంతరం కోర్టు నిందితులు ఏ1 మరియు ఏ2లకు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(1)(x) కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
అదేవిధంగా ప్రధాన నిందితుడు నక్క పర్వతాలు (ఏ1)కు ఐపిసి సెక్షన్ 417 కింద ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించగా, ఐపిసి సెక్షన్ 420 కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. ఐపిసి సెక్షన్లు 323 కింద ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా మరియు ఐపిసి 506 కింద ఒక్కొక్కరికి 1000 జరిమానా విధిస్తూ, చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అన్ని శిక్షలు ఏకకాలంలో అమలులో ఉండనున్నాయి. దీంతో ఏ1 నక్క పర్వతాలకు మొత్తం 11 సంవత్సరాల వివిధ శిక్షలు మరియు రూ.5,000 జరిమానా విధించగా, ఏ2 నీలం సత్తమ్మకు 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.3,000 జరిమానా విధించబడింది. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా డి.నరసింహ వాదనలు వినిపించారు. కేసు నమోదు సమయంలో దిండి ఎస్సైగా పనిచేసిన ఎం. రామాంజనేయులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయగా, దేవరకొండ ఎస్‌డీపీఓ కె.మనోహర్ గారు దర్యాప్తు నిర్వహించారు. ప్రస్తుతం డిండి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఒగా బాలకృష్ణ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కె.బీసన్న, దేవరకొండ ఎస్ డి పి ఒ గా ఎం.వి.శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. కోర్టు విధుల్లో భాగంగా డిండి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణన్, పోలీస్ కానిస్టేబుల్ పి.లింగయ్యలు కోర్టు డ్యూటీ అధికారులు వ్యహరించారు. వీరందరిని జిల్లా ఎస్పి కోర్టులో సరైన ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్ష పడే విదంగా కృషి చేసినందుకు అభినందిచారు..