prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:26 pm Digital Edition : SHEKARREDDY PATANCHERUV

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మాజీ మంత్రి హరీశ్ రావు

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – మాజీ మంత్రి హరీశ్ రావు

జీఎంఆర్ కన్వెన్షన్‌లో అవగాహన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్

పటాన్‌చెరు,జూలై 12(ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమానికి మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన సవరణలు, కొత్త నమోదు, మార్పులు సకాలంలో పూర్తి చేసుకునేలా పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి సహకరించాలని పిలుపునిచ్చారు.
పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, శంకర్ యాదవ్, యాదగిరి యాదవ్, బొల్లారం బాల్ రెడ్డి, సోమిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.