prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 7:28 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

ఎల్ నీనో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

ఎల్ నీనో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల దృష్ట్యా వరికి
బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి.

మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ రవి, ఎంపీడీవో సుమంత్, తాహశీల్దార్ హిమబిందు, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఎల్ నీనో లో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా అరుతడి పంటలైన కందులు, పెసలు, మినుములు, జొన్నలు, వేరుశనగలు, ఉద్యాన పంటలైనటువంటి కూరగాయలు, పండ్లు, పూల తోటలు, మునగ తోటలు, ఆయిల్ పామ్ పంటలు వేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ ప్రత్యామ్నాయ పంటలకు ఉద్యానవన శాఖ నుంచి అందిస్తున్నటువంటి వివిధ రకాల రాయితీ పథకాల గురించి వివరించడం జరిగింది. కూరగాయ పందిరిలకు, డ్రిప్పు, స్ప్లింక్లర్స్ కు, కూరగాయ విత్తనాలకు, నారుకు అందిస్తున్న వివిధ రకాల రాయితీలను ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందవలని కోరారు. అలాగే వి.బి.జి రామ్జి పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాంట్స్, బోర్ వెల్స్, ఓపెన్ వెల్స్ లకు సంబంధించిన పథకాలను గ్రామస్థాయిలో తీర్మానం చేసి ఉపయోగించుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఏ డి ఏ రవి నాయక్, మండల పరిషత్ అధికారి సుమంత్ రెడ్డి, మండల తాసిల్దార్ మరియు మండల వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన విస్తరణాధికారి షేక్ ఇస్మాయిల్, ఏపీఎం స్వరూప, ఏపీవో ఉమా, ఎంపీఓ నవీన్, సీసీ సందీప్, పంచాయతీరాజ్ మరియు నీటిపారుదల ఏఈ, వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు సెక్రటరీలు పాల్గొనటం జరిగింది.